ISRO SUCESS : నింగిలోకి దూసుకెళ్లిన PSLV C - 56

By :  Kiran
Update: 2023-07-30 02:46 GMT

పీఎస్‌ఎల్‌వీ సీ - 56 ప్రయోగం సక్సెస్ అయింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్‌ - సార్‌ ఉప్రగ్రహంతో పాటు ఆరు చిన్న ఉపగ్రహాలను ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. మొత్తం 420కిలోల బరువుగల 7 ఉపగ్రహాలను PSLV C-56 మోసుకెళ్లింది. ఆదివారం ఉదయం 6.31 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సి56 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఏడాది ఇస్రో ప్రయోగించిన కమర్షియల్ శాటిలైట్ ప్రయోగాల్లో ఇది మూడోది.

నాలుగు దశల్లో రాకెట్‌ ప్రయోగం జరిగింది. 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం పీఎస్‌ఎల్‌వీ సీ-56 విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లింది. రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంతో సైంటిస్టులు సంబురాలు చేసుకున్నారు. ఈనెలలో ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కాగా, పీఎస్‌ఎల్వీ సీరీస్‌లో 58వ ప్రయోగం కావడం విశేషం. ప్రయోగం విజయవంతమైన అనంతరం మాట్లాడిన ఇస్రో చీఫ్ డా.సోమనాథ్‌ ఉపగ్రహాలను కచ్చితమైన కక్ష్యలోకి వాహకనౌక ప్రవేశపెట్టిందని చెప్పారు. పీఎస్‌ఎల్‌వీ సీరిస్లో మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నట్లు చెప్పిన ఆయన.. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఉంటుందని అన్నారు. ఇస్రోపై నమ్మకం ఉంచిన సింగపూర్‌ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు. 

Tags:    

Similar News