కౌంటింగ్ మెషిన్లకు చుక్కలు చూపిన దొంగసొమ్ము..

Update: 2023-12-07 11:38 GMT

ఐటీ దాడుల సమయంలో అధికారులు డబ్బు ఎక్కువగా దొరికితే డబ్బు కౌంటింగ్ వాయిదా వేస్తుంటారు. కొన్నిసార్లు చేతులతోనే కాదు, కౌంటింగ్ మెషిన్లతోనూ లెక్కించలేనంత సొమ్ము బయటపడుతుంటుంది. తాజాగా కౌంటింగ్ మిషన్లకు కూడా చుక్కలు చూపించేంత భారీ నగదు పట్టుబడింది. గుట్టలగుట్టల నోట్లను లెక్కించలేక కౌంటింగ్ మెడిషన్లు చెడిపోయాయి. దీంతో అధికారులు లెక్కింపు తాత్కాలిక విరామం ఇచ్చారు.

ఒడిశా, బిహార్‌లలో మద్యాన్ని సరఫరా చేస్తున్న బౌధ్ డిస్టిలరీస్ కంపెనీలో కళ్లు తిరిగే దొంగసొత్తు బయటపడింది. పన్నుఎగవేత ఆరోపణలు రావడంతో అధికారులు రెండో రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. రెండు రోజులపాటు జరిపిన సోదాల్లో కట్టలకొద్దీ డబ్బు బయటపడింది. ఒడిశాలోని బోలంగీర్, సంబల్‌పూర్, ఖోర్దా, జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దగా ప్రాంతాల్లో దాడులు జరాగాయి. ప్రస్తుతానికి కౌంటింగ్ మెషిన్లతో రూ. 50 కోట్ల నగదును లెక్కించారు. కౌంటింగ్ మిషన్లు మొరాయించంతో కొత్త మెషిన్లు తెప్పిస్తున్నారు. అక్రమ సొమ్ము రూ. 150 కోట్ల రూపాయల వరకు ఉందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News