Manish Sisodia: మనీష్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట

Byline :  Veerendra Prasad
Update: 2024-02-05 13:55 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఆప్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతించింది. కోర్టు ఆదేశం మేరకు మనీష్ సిసోడియా డాక్టర్ సమక్షంలో ఆమెను పరామర్శిస్తారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. గత 20 సంవత్సరాలుగా మనీష్ సిసోడియా భార్య సీమా మల్టిపుల్ స్క్లెరోసిస్‌తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో.. రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ ఫిబ్రవరి 2న దరఖాస్తుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నోటీసు జారీ చేశారు.

మనీష్‌ సిసోడియా ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏడాదిగా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను సీబీఐ(CBI) అరెస్టు చేసింది. మార్చి 9న ఈడీ(ED) అరెస్టు చేసింది. మనీష్ సిసోడియా కార్యకలాపాల వల్ల దాదాపు రూ.622 కోట్ల కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపించింది. ఆయన ముందస్తు బెయిల్ దరఖాస్తులను హైకోర్టు, ట్రయల్ కోర్టు గత ఏడాది మే 30న తిరస్కరించాయి. కాగా సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత ఆయన భార్య సీమా ఆరోగ్యం క్షీణించింది.




Tags:    

Similar News