రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఐఆర్సీటీసీ

Update: 2023-07-17 09:01 GMT

రైల్లో ప్రయాణాలు చేస్తున్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ. ట్రైన్ ర్నీ చేస్తున్నవాళ్ళు ఫుడ్ కోసం ఇక మీదట ఇబ్బందులు పడక్కర్లేదని చెప్పింది. కేవలం 20రూ లకే ఇక మీదట ఫుడ్ ఆర్డర్ చేసుకుని హ్యాపీగా తినొచ్చని తెలిపింది.

తక్కువ ధరలకే ప్రయాణాకులకు మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతో రైల్వేస్ జనతా ఖానా ను ప్రారంభించింది. ప్రస్తుతానికి నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ జంక్షన్ లో మొదలుపెట్టారు. రానున్న రాజుల్లో దీన్ని మరింత విస్తరించాలని రైల్వేస్ అనుకుంటోంది. తక్కువ ధరకే కాకుండా, నాణ్యమైన భోజనాన్ని కూడా అందిస్తామని చెబుతోంది ఐఆర్సీటీసీ.

ఈ పుడ్ రెండు కేటగిరీలలో అందిచనుంది రైల్వేస్. 7 పూరీలు, కూర, ఆవకాయ లాంటివి కేవలం 20 రూలకే దొరుకుతాయి. అదే 50 రూ. కాంబో ప్యాక్ లో అయితే 350 గ్రాముల రాజ్మా లేదా రైస్, పావ్ బాజీ, మసాలాదోశ, కిచిడీలాంటివి లభ్యమవుతాయి. ఇక 200 మిలీ వాటర్ బాటిల్ ఖరీదు కేవలం 3 రూ మాత్రమే. ప్రస్తుతానికి ఒక్కచోటే ఇది అమలులో ఉన్నా...దీన్ని కనుక విస్తరిస్తే ప్రయాణికలకు చాలా ప్రయోజనంగా ఉంటుంది.



Tags:    

Similar News