మాకు ఏ కూటమి నుంచి ఆహ్వానం అందలేదు.. భవిష్యత్తులో చూసుకుంటాం: కుమారస్వామి
ఇవాళ (జులై 17) బెంగళూరులో జరుగనున్న ప్రతిపక్షాల సమావేశం జరుగనుంది. మొత్తం దేశంలోని 26 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొంటున్నాయి. దాంతో బీజేపీ అలర్ట్ అయింది. ఈ సమావేశంలో దాదాపు 30 పార్టీలు పాల్గొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం (జులై 18) ఢిల్లీలో ఎన్టీయే మిత్రపక్షాల సమావేశం నిర్వహించనుంది. ఈ క్రమంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ కుమారస్వామి స్పందించారు. ప్రతిపక్షం, మిత్ర పక్షాల సమావేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘విపక్ష పార్టీలలో జేడీఎస్ ను భాగస్వామిగా పరిగణించలేదు. దీంతో జేడీఎస్ విపక్ష కూటమిలో లేదన్నది స్పష్టం అయింది. ఆ మహా కూటమిలో జేడీఎస్ చేరే ప్రసక్తే లేదు. ఎన్డీఏ నుంచి కూడా మాకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఆ ఫ్రంట్ ఎలా ఉంటుందో కూడా చూస్తాం’ అని కుమారస్వామి అన్నారు. దీంతో జాతీయ రాజకీయాల్లో కుమారస్వామి వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.