దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరుకుంది. కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు కూడా 63కు చేరుకున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ లెక్క తేలింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదుకాగా.. మహారాష్ట్రలో తొమ్మిది కొత్త కేసులు వచ్చాయి. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగానే కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.
కేరళలో 79 ఏళ్ల మహిళకు జేఎన్.1 వేరియంట్ సోకింది. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఉంది పూర్తిగా కోలుకున్నారని వైద్యులు చెప్పారు. కాగా అమెరికా, చైనా, సింగపూర్‌లతోపాటు భారత్‌లోనూ ఈ కేసులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా డబ్ల్యూహెచ్‌వో సూచించింది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని చెప్పుకొచ్చింది.