RRB : జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఆర్‌ఆర్‌బీ

Update: 2024-02-06 13:55 GMT

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారికి ఆర్ఆర్ఆర్ శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు 2024 ఏడాదికి సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను రిలీజ్ చేసింది. అన్ని అధికారిక వెబ్‌సైట్‌లల్లో ఈ క్యాలెండర్‌ను అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. ఈ ఏడాదిలో రాబోయే నోటిఫికేషన్లు, పరీక్ష షెడ్యూల్స్ అన్నీ ఈ క్యాలెండర్‌లో నమోదు చేశారు.

5,696 అసిస్టెంట్ లోకో పైలట్, 9000 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్ఆర్‌బీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేటగిరీలు, గ్రూప్ డీ, ఐసోలేటెడ్ కేటగిరీలకు సంబంధించి జాబ్స్ షెడ్యూల్‌ను ఆర్ఆర్‌బీ ప్రకటించింది. ఎన్టీపీసీ, జేఈ, పారామెడికల్ కేటగిరీలు, గ్రూప్ డీ పోస్టులతో పాటుగా పలు కేటగిరీల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జులై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య జారీ చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల నోటిఫికేషన్ అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెలల మధ్య విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

నోటిఫికేషన్ విడుదలయ్యే తేదీలివే:

ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీ జనవరి 20, 2024 -5,696 ఖాళీలు

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్స్ - ఏప్రిల్ నుంచి జూన్ మధ్య -9,000 ఖాళీలు

గ్రాడ్యుయేట్స్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 - జులై నుంచి సెప్టెంబర్ మధ్య విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ 2024 - అండర్ గ్రాడ్యుయేట్ - జులై నుంచి సెప్టెంబర్ మధ్య విడుదల

ఆర్‌ఆర్‌బీ జేఈ రిక్రూట్‌మెంట్ 2024 జులై-సెప్టెంబర్ మధ్య నోటిఫికేషన్ విడుదల

ఆర్‌ఆర్‌బీ పారామెడికల్ రిక్రూట్‌మెంట్ 2024- జులై-సెప్టెంబర్ మధ్య విడుదల

ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ 2024 - జులై నుంచి సెప్టెంబర్ మధ్య విడుదల

ఆర్‌ఆర్‌బీ ఎంఐ రిక్రూట్‌మెంట్ 2024 - అక్టోబర్ నుంచి డిసెంబర్‌ మధ్య విడుదల

Tags:    

Similar News