ISRO Recruitment 2024: పదో తరగతి సర్టిఫికెట్తో ఇస్రోలో ఉద్యోగం.. నెలకు భారీ జీతంతో..!
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త చెప్పింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో ఉంద్యోగం పొందే అవకాశం కల్పించింది. కేవలం పదో తరగతి పాసైతే చాలు.. ఈ ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లు ఉన్నవారు కూడా ఈ ఉద్యోగం కోసం పోటీ పడొచ్చు. బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ లాస్ట్ ఫీజు.. మార్చి 1 వరకు అవకాశం కల్పించారు. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇస్రో అధికారిక వెబ్ సైట్.. https://www.isro.gov.in/ లో తెలుసుకోవచ్చు.
విభాగాల వారీగా మొత్తం ఖాళీలు:
సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ: 05 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్: 55 పోస్టులు
సైటిఫిక్ అసిస్టెంట్: 06 పోస్టులు
లైబ్రరీ అసిస్టెంట్: 01 పోస్టులు
టెక్నీషియన్ -బీ/డ్రాఫ్ట్స్ మ్యాన్-బి: 142 పోస్టులు
ఫైర్ మ్యాన్-ఎ: 03 పోస్టులు
కుక్: 04 పోస్టులు
లైట్ వెహికిల్ డ్రైవర్ ఎ అండ్ హెవీ వెహికిల్ డ్రైవర్ ఎ: 8 పోస్టులు
వయోపరిమితి: అభ్యర్థులు పోస్టును అనుసరించి 01.03.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: సైంటిస్ట్ / ఇంజినీర్- ఎస్సీ / టెక్నికల్ అసిస్టెంట్/ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750, టెక్నీషియన్-B/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-B/ కుక్/ ఫైర్‌మ్యాన్-A/ లైట్ వెహికల్ డ్రైవర్-A/ హెవీ వెహికల్ డ్రైవర్-A పోస్టులకు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం: నెలకు సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులకు రూ.56,100, టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900, టెక్నీషియన్-బి/డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులకు రూ.21,700, కుక్/ఫైర్‌మ్యాన్-ఎ/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ అండ్ వీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ పోస్టులకు రూ.19,900 ఉంటుంది.