మందకృష్ణ మాదిగ ప్రధాని మోదీకి అమ్ముడుపోయారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టడానికి మంద కృష్ణకు 72 కోట్లు ముట్టాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమంటే 25కోట్లు అడిగారని మండిపడ్డారు. మొన్నటివరకు మోదీని తిట్టిన మంద కృష్ణ.. ఇప్పుడు దేవుడు అనడం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ, మంద కృష్ణ బాగా నటించారని విమర్శించారు.
ప్రపంచంలో అత్యంత అవినీతి జరుగుతున్న దేశంగా ఇండియా మారిందని పాల్ అన్నారు. ట్రంప్ చిన్న తప్పుచేస్తే ఆయన్ని జైల్లో పెట్టారని.. మరి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకుంటున్నా ఎవరూ స్పందించడం లేదన్నారు. ప్రధాని వ్యాపారులకు రుణ మాఫీ చేస్తున్నారని.. కానీ పేదలకు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మోదీ బీసీ కాదని.. తన శిష్యుడు అని పాల్ చెప్పారు. ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోకుండా నోటాకు ఓటెయ్యాలని సూచించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి సింబల్ కేటాయించకపోవడంపై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు.