కంగన రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఎమర్జెన్సీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జూన్ 14న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు కంగన్ రనౌత్ తెలిపారు.1975లో అప్పటి దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్ధితిని ప్రకటించారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆమె సినిమాను తెరకెక్కించారు.ఇందిర పాత్రలో కంగ నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.ఆ చీకటి రోజుల వెనుక జరిగిన స్టోరీని ఈ సినిమా ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నానంటూ కంగనా ఈ ఎమర్జెన్సీ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.
నేడు తన ఇన్‌స్టాలో ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ వెల్లడించింది. "ఇండియా చీకటి రోజుల వెనుక స్టోరీని చూడండి. జూన్ 14, 2024న ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాను. అత్యంత భయంకరమైన ప్రధానమంత్రి చరిత్ర మరోసారి కళ్ల ముందుకు రానుంది. ఇందిరా గాంధీ సినిమాస్ లోకి వస్తోంది. థియేటర్లలో ఎమర్జెన్సీ 14 జూన్, 2024న" అనే క్యాప్షన్ తో ఆమె ఈ పోస్ట్ షేర్ చేసింది. ఇప్పటికే ధాకడ్, చంద్రముఖి 2, తేజస్ మూవీస్ తో హ్యాట్రిక్ ఫ్లాపులతో సతమతమవుతున్న కంగనా రనౌత్.. ఇప్పుడీ ఎమర్జెన్సీ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. తనకు ఇది చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని ఆమె పీటీఐతో తెలిపింది."ఎమర్జెన్సీ నాకు చాలా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. మణికర్ణిక తర్వాత నేను డైరెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఈ పెద్ద ప్రాజెక్ట్ కోసం ఇండియా, అంతర్జాతీయ స్థాయిలో టాలెంటెడ్ వ్యక్తులు పని చేశారు. ఇదొక గ్రాండ్ పీరియడ్ డ్రామా" అని కంగనా చెప్పింది.