ఆ గుడికి వెళ్తే ష‌ర్ట్ విప్ప‌మ‌న్నారు.. క‌ర్నాట‌క సీఎం సంచలన కామెంట్స్

Byline :  Krishna
Update: 2023-09-07 12:03 GMT

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ లాంటిదని.. దానిని పూర్తిగా నిర్మూలించాలని ఉదయనిధి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

గ‌తంలో తాను కేర‌ళ‌లోని ఓ ఆల‌యానికి వెళ్తే ష‌ర్ట్ విప్పి లోప‌లికి వెళ్లాల‌న్నార‌ని సిద్ధరామయ్య చెప్పారు. ‘‘ఓ సారి నేను కేరళలోని ఓ గుడికి వెళ్లాను. షర్ట్ విప్పి గుడిలోకి రావాలని అక్కడివాళ్లు నాతో చెప్పారు. దీంతో ఆ గుడిలోకి వెళ్లడానికి తిరస్కరించాను. నేను బయటే ఉండి ప్రార్థన చేస్తానని చెప్పాను. అయితే కొందరిని మాత్రమే చొక్కా విప్పేయమని అడిగారు. ఇది అమానుష ఆచారం. దేవుని ముందు అందరూ సమానమే’’ అని సీఎం అన్నారు. బెంగుళూరులో నారాయ‌ణ గురువు 169వ జయంతి ఉత్సవాల్లో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు.



Tags:    

Similar News