కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయణం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా హుక్కా తాగడాన్ని నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు వెల్లడించారు. యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారని మంత్రి తెలిపారు. ప్రజలు, యువత ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయణం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పొగాకు ఉత్పత్తులకు యువత బానిసలుగా మారుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతుండడంతో గతేడాది సెప్టెంబర్ నెలలో హుక్కా బార్లను ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. పొగాకు ఉత్పత్తుల కొనుగోలు వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలిపింది. భవిష్యత్ తరాలకు మెరుగైన, సురక్షితమైన ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. యువత హుక్కాబార్లకు ఆకర్షితులవుతున్నారు. ఇది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా నిండా పాతికేళ్లు రాకముందే చాలా మంది యువకులు ప్రాణాంతక రోగాల బారిన పడుతున్నారు. అని కర్ణాటక మంత్రి దినేశ్ తెలిపారు. పాఠశాలలు, ఆలయాలు, మసీదులు, శిశు సంరక్షణ కేంద్రాలు, హాస్పిటల్ చుట్టుపక్కల పొగాకు వాడకం, విక్రయాన్ని ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. ప్రస్తుతం.. COTPA (సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధిత చట్టం) ప్రకారం .. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది. కర్నాటక ప్రభుత్వం ఈ చట్టంలో కొన్ని సవరణలు చేసింది, ఇందులో బహిరంగంగా పొగాకు వినియోగాన్ని నిషేధించడం, పొగాకు వినియోగం, సిగరెట్ తాగడంపై నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాను పెంచడం వంటివి ఉన్నాయి.