ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ముందస్తు బెయిల్

Byline :  Vamshi
Update: 2024-03-16 06:21 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజురు చేసింది. ఈడీ విచారణకు పలుమార్ల గైర్హాజరైన క్రేజీవాల్ పై ఈడీ మెజిస్టీరియల్ కోర్టుకు వెళ్లింది. దీంతో 16న తమ ఎదుట హాజరు కావాలని న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు. దీనిపై స్టే ఇవ్వాలన్న సీఎం పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఈ రోజు అవెన్యూ కోర్టు ఎదుట హాజరయ్యారు. అనంతరం రూ.51 వేల బాండ్ రూ.1 లక్షపూచీకత్తతో బెయిల్ ఇచ్చింది.

దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీ చేసింది. తనకు జారీ చేసిన నోటిసులను రద్దు చేయాలని కోర్టును కేజ్రీవాల్ కోరారు. అయితే కేజ్రీవాల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. కోర్టు తన విజ్ఞప్తిని పరిశీలించకపోవడంతో కోర్టు కేజ్రీవాల్ హాజరయ్యారు. కాగా మద్యం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం కింద సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ 8 సార్లు నోటీసులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినప్పటికీ కోర్ట్ బెయిల్ ఇచ్చింది.

Tags:    

Similar News