రేపో, ఎల్లుండో కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారు..AAP leader Bhardwaj

Byline :  Vamshi
Update: 2024-02-23 08:07 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు కేజ్రీవాల్ కు ఈడీ ఏడు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఈడీ సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ కేసు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పరిధిలో ఉంది. మరోవైపు కేజ్రీవాల్ ను రెండు, మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తారంటూ ఆప్ నేత సౌరబ్ భరద్వాజ్ చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నందుకు కేజ్రీవాల్ ను జైలుకు పంపిస్తామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో వివిధ రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తే కేజ్రీవాల్ జైలుకు వెళ్తారని బీజేపీ నేతలు అంటున్నారని తెలిపారు. కేజ్రీవాల్ జైల్లో పెడితే కాంగ్రెస్ తో ఆప్ పొత్తులు ఉండవని వారంతా అనుకుంటున్నారని చెప్పారు.

కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే కేజ్రీవాల్ ను జైలుకు పంపుతామని బీజేపీ నేతలు తమను బెదిరిస్తున్నట్లు భరద్వాజ్ ఆరోపించారు. కేజ్రీవాల్ సురక్షితంగా ఉండాలంటే ఇండియా కూటమి నుంచి ఆప్ బయటకు రావాలని బీజేపీ హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. ఆప్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే బీజేపీ ఆటలు సాగవని వారు అనుకుంటున్నట్లు తెలిపారు. పొత్తుతో ప్రతిచోటా తమకు కష్టాలు తప్పవనే భయంలో బీజేపీ ఉందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ఏ రాష్ట్రంలో సాధ్యం కాదని బీజేపీ నేతలు భయపడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి కాంగ్రెస్ తో చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పొత్తులపై ఇరుపార్టీల నేతలు ఓ క్లారిటీ ఇస్తాయని ఆప్ నేతలు ప్రకటించారు. 

Tags:    

Similar News