Onam Liquor Sales : కేరళకు ఓనం కిక్కు.. చంద్రయాన్ 3 బడ్జెట్ను మించి ఆదాయం

Byline :  Krishna
Update: 2023-09-01 11:17 GMT

కేరళ ప్రభుత్వానికి ఓనం పండుగ మంచి కిక్కు ఇచ్చింది. నిధుల కొరతతో ఇబ్బందులు పడుతున్న సర్కార్కు మందుబాబులు మస్త పైసల్ ఇచ్చారు. ఓనం పండుగను పురస్కరించుకుని కేరళ ప్రజలు ఫుల్గా తాగారు. రికార్డు స్ధాయి మద్యం అమ్మకాలతో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం వచ్చింది. కేవలం పదిరోజుల్లో చంద్రయాన్ 3 బడ్జెట్ను మించిన ఆదాయం వచ్చింది.

10 రోజుల్లో సుమారు రూ. 759 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. చంద్రయాన్ 3 బడ్జెట్ రూ. 659కోట్లు అయితే.. 10 రోజుల్లోనే అంతకుమించిన ఆదాయం వచ్చింది. ఆగస్టు 2023లో కేరళలో మొత్తం రూ.1799 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది పండగ సీజన్తో పోలిస్తే 8.5 శాతం సేల్స్ పెరిగాయి. ఓనం పండగ ఉత్రాదం రోజున రూ. 116 కోట్ల మద్యం విక్రయాలు నమోదయ్యాయి.

కేరళలొ మొత్తం 269 మద్యం విక్రయ కేంద్రాలున్నాయి. మలప్పురం జిల్లాలోని తిరూర్లోని బెవ్‌కో అవుట్‌లెట్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయి. కేరళకు చెందిన ప్రముఖ రమ్ బ్రాండ్ ‘జవాన్’ 10 రోజుల్లో 70 వేల కేసులు అమ్ముడయ్యాయి. ఇక అగస్ట్ 20న ప్రారంభమైన ఓనం పండుగా.. అగస్ట్ 31తో ముగిసింది. కేరళలోని అతిపెద్ద పండుగా ఇది.. ఇక ఈ పండుగ‌ను కేరళ ప్రజలే కాకుండా.. త‌మిళ‌నాడు, కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రజలు కుడా ఏటా ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు.


Tags:    

Similar News