గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య వివాదాలు చాలా కామన్. అయితే ఏదైనా కార్యక్రమాల్లో ఎదురైతే మాత్రం.. ఏం జరగలేదన్నట్లు ఒకరినొకరు పలకరించుకుంటారు. కానీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ , సీఎం పినరయి విజయన్ లు మాత్రం అలా కాదు. ఎదురుపడటం అటుంచితే.. పక్కపక్కన కూర్చున్నా కనీసం పలకరించుకోలేదు. కొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇవాళ రాజ్ భవన్ లో జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వీరిద్దరు పక్కపక్కన కూర్చున్నా.. ఒకరినొకరు కనీసం పలకరించుకోలేకపోవడం గమనార్హం.
కేరళ రాజ్ భవన్ లో కేబీ గణేష్ కుమార్, రామచంద్రన్‌లను మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. కేవలం 5 నిమిషాలు జరిగిన కార్యక్రమంలో గవర్నర్, సీఎంలు పక్కపక్కనే కూర్చున్నారు. కానీ, ఒకరివైపు ఒకరు చూసుకోలేదు. కనీసం మర్యాద పూర్వకంగా పలకరించుకోలేదు. కార్యక్రమం అయిపోయిన వెంటనే సీఎంకి ఎలాంటి శుభాకాంక్షలు చెప్పకుండానే వేదికపై నుంచి గవర్నర్ వెళ్లిపోయారు. దీంతో రాజ్ భవన్ లో ఏర్పాటుచేసిన విందుకు హాజరు కావొద్దని సీఎం, మంత్రలు నిర్ణయించుకున్నారు.