Arif Mohammed Khan : ఎస్ఎఫ్ఐ నిరసన.. రోడ్డుపై బైఠాయించిన గవర్నర్

Byline :  Krishna
Update: 2024-01-27 09:48 GMT

కేరళలో అధికార ఎల్డీఎఫ్, రాష్ట్ర గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గణతంత్ర రోజున జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత కేవలం 78 సెకన్లు మాత్రమే గవర్నర్ ప్రసంగించడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన 60 పేజీల ప్రసంగాన్ని ఆయన పక్కనబెట్టేశారు. దీంతో రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమాన్ని సీఎం పినరయి విజయన్ బహిష్కరించారు. ఇక ఇవాళ కొల్లామ్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు గవర్నర్ కారును అడ్డుకున్నారు. యూనివర్సిటీల్లో వీసీల నియామకానికి గవర్నర్ అడ్డుతగులుతున్నారంటూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు.




 


ఎస్ఎఫ్ఐ కార్యకర్తలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వైపు దూసుకెళ్లగా పోలీసులు రక్షణగా నిలిచారు. వెంటనే కారులోకి వెళ్ళాలని విజ్ఞప్తి చేయగా.. ఆయన దానికి నిరాకరించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు తనకు అడ్డుతగిలారన్నారు. తన కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను ఎలా అనుమతించారని.. సీఎం కాన్వాయ్ వెళ్తే ఇలానే అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న చాయ్ దుకాణం ముందు బైఠాయించారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదని భీష్మించుక కూర్చున్నారు. దీంతో పోలీసులు 12మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. మిగితావరి సంగతేందంటూ నిలదీశారు. కాగా గవర్నర్ బైఠాయించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.


 






Tags:    

Similar News