జాదవ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థి మృతి కేసులో కీలక విషయాలు

Update: 2023-08-23 12:33 GMT

పశ్చిమ్‌ బెంగాల్‌లోని జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో 18 ఏళ్ల డిగ్రీ విద్యార్థి స్వప్నదీప్ మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల నివేదికలో కీలక విషయాలు వెలుగుచూశాయి. చనిపోవడానికి ముందు అతడిని నగ్నంగా ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు. ర్యాగింగ్ లో భాగంగా విద్యార్థులు బట్టలు విప్పించి..వసతి గృహానికి చెందిన రెండో అంతస్తు కారిడర్ లో నగ్నంగా ఊరేగించినట్లు పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ కేసులో ఆధారాలు సేకరించి మొత్తం 12 మంది అరెస్ట్ చేసినట్లు తెలిపారు.మరో ఇద్దరు విద్యార్థులకు సమన్లు జారీచేసినట్లు పేర్కొన్నారు. వారిలో పూర్వ విద్యార్థులు కూడా ఉన్నట్లు గుర్తించారు. అదే విధంగా కేసు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఒక నిందితుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడని వివరించారు.

ఇటీవల జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో జరిగిన స్వప్నదీప్ సంఘటన ఒక్కసారిగా ఉలిక్కిపడేటట్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం ఆ రాష్ట్రాన్నే కాక, దేశమంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. డిగ్రీలో చేరిన నెలల వ్యవధిలోనే స్వప్నదీప్ రెండో అంతస్తు నుంచి కిందపడి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ర్యాగింగే స్వప్నదీప్ మృతికి ప్రధాన కారణమని తేలింది.

Tags:    

Similar News