కీలక వడ్డీ రేట్లు యథాతథం : Governor Shaktikanta Das

Update: 2024-02-08 06:47 GMT

కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ (RBI) యథాతథంగా ఉంచింది. అంతా అనుకున్నట్లగానే రెపోరేటును (Repo Rate) 6.5 శాతం వద్దే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఇవాళ తెలిపారు. ఇండియా వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని దాస్ స్పష్టం చేశారు. దేశీయంగా ఎకానమిక్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పారు. ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని చెప్పుకొచ్చారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధి అయిన 4 శాతం లోపు తీసుకు రావడంలో ఎలాంటి మార్పులేదన్నారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు.

ఆహార ధరలపై ఒత్తిళ్లను ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుందన్నారు గవర్నర్‌ దాస్. దేశ ఆర్థిక కార్యకలాపాల్లోని జోరు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని తెలిపారు. మూలధన వ్యయం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుతో దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. పట్టణాల్లో ఎక్స్ ఛెంజ్ స్ట్రాంగ్ ఉందని.. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ వృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. 2024-25కు జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం, 2024-25లో 4.5 శాతంగా అంచనా వేశారు. జీయో పొలిటికల్ టెన్షన్స్ సప్లయి సిస్టమ్ పై ప్రభావం చూపుతున్నాయని చెప్పుకొచ్చారు.

తద్వారా క్రూడ్ ఆయిల్ వంటి కమొడిటీ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. 2023-24లో ఇండియా కరెన్సీ రూపాయి కొంత మేర ఒడిదొడుకులను చవిచూసిందని గుర్తు చేశారు. ఎక్స్ ఛెంజ్ వాల్యూ స్థిరంగా కొనసాగుతోందని చెప్పారు. అత్యధిక రెమిటెన్స్‌లను స్వీకరించే దేశంగా భారత్‌ కొనసాగుతోందన్నారు. ఇండియా ఫారన్ ఎక్స్ ఛెంజ్ రిజర్వ్స్ 622.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయని తెలిపారు. ఇకపై అన్ని రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రుణాలకు ‘కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌’ తప్పనిసరి అని చెప్పారు. అంతేగాక, దీన్ని అమలు చేసేందుకు బ్యాంకులకు కొంత టైం ఇవ్వనున్నారు. డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పెంపొందించడానికి, అటువంటి లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని ప్రతిపాదన తీసుకువచ్చారు. అంతేగాక, ఆఫ్‌లైన్‌లోనూ రిటైల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ పనిచేసేలా చర్యలు తీసుకొనున్నట్లు గవర్నర్ దాస్ తెలిపారు.

Tags:    

Similar News