Ayodhya Ram Mandir: ఇంటికే అయోధ్య రాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి.
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.జనవరి 22, 2024న అయోధ్యలోని రామమందిరం (Ayodhya Ram Mandir)లో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వీఐపీలు పాల్గొననున్నారు. ఆరోజు భారీ సంఖ్యలో వీఐపీలు, ప్రముఖులు,కరసేవకులు మాత్రమే అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉంది. సామాన్య ప్రజలు కూడా అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. కానీ వీఐపీల తాకిడిని పరిగణలోనికి తీసుకుని ఆరోజు అయోధ్యకు వెళ్లకపోవడమే మంచిదని ట్రస్టు నిర్వాహకులు తెలిపారు. దాదాపు 25 లక్షల మందికి పైగా సామాన్య ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే అయోధ్య రామమందిరాన్ని సందర్శించలేని వారు కూడా.. శ్రీ రాముని మహాప్రసాదాన్ని(Maha Prasadam) నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు.
రామభక్తులకోసం ఇంటికే మహాప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు అలయ ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. ఖాదీ ఆర్గానిక్ (Khadi Organic Website)అనే వెబ్సైట్ అయోధ్య రామమందిరం నుండి నేరుగా మీ ఇంటి వద్దకే ప్రసాదాన్ని అందజేస్తామని పేర్కొంది. మీరు కూడా ఈ ప్రసాదాన్ని తీసుకోవాలనుకుంటే ఈ పద్ధతులను అనుసరించండి
తొలి రోజు ప్రసాదం ఎలా పొందాలి?
1.మీరు ముందుగా ఖాదీ ఆర్గానికి వెబ్సైట్ (https://khadiorganic.com)లోకి వెళ్లాలి.
2. ఇప్పుడు కిందికి స్క్రాల్ చేసి.. ఫ్రీ ప్రసాద పంపిణీ కార్యక్రమం బ్యానర్‌ని గమనించాలి.
3. ‘Get Free Prasad’ బటన్‌పై క్లిక్ చెయ్యండి.
4. మీరు ముఖ్యమైన సమాచారాన్ని నింపాల్సి ఉంటుంది. అంటే మీ పేరు, ఫోన్ నంబర్, ఇంటి అడ్రెస్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.
5. మీకు ఎలాంటి ఉచిత ప్రసాదం కావాలో ఎంచుకోవచ్చు. ప్రస్తుతం లడ్డూ, మిస్తీ (Mishti) ఆప్షన్లు ఉన్నాయి.
6. వివరాలు ఇచ్చాక సబ్మిట్ (Submit) క్లిక్ చెయ్యండి. దాంతో ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ ప్రసాదం జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిన తర్వాత మీకు డెలివరీ అవుతుంది. ఇది ఉచిత ప్రసాదమే అయినప్పటికీ.. డెలివరీ ఛార్జీల కింద రూ.51 తీసుకుంటున్నారు. ఈ మనీ చెల్లించి, ప్రసాదం పొందవచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్ అనీ, త్వరగా బుక్ చేసుకోమని వెబ్ సైట్ నిర్వాహకులు తెలిపారు. ఖాదీ ఆర్గానిక్స్ అనేది డ్రిల్ మ్యాప్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కింద నడుస్తున్న ప్రైవేట్ కంపెనీ. ఉత్పత్తులను విక్రయించే భారతీయ కంపెనీ. ఖాదీ సవాయువ నావికులు ప్రసాద్‌తో కలిసి రామ మందిరానికి వెళ్లి అక్కడ రాముడికి భోగాన్ని సమర్పిస్తారు. దీని తరువాత, దేవునికి సమర్పించిన భోగాన్ని భక్తులందరికీ ప్రసాదం రూపంలో పంపిణీ చేస్తారు.