Kishan Reddy : తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించరు: కిషన్‌రెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-11-17 07:05 GMT

తెలంగాణ ఉద్యమంలో కొంత మంది యువత ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు. తాజాగా ఈ కామెంట్స్​పై బీజేపీ నేతలు కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందిస్తూ.. చిదంబరంపై విరుచుకుపడ్డారు.

తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదని... ప్రజలే కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం చేసిందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను ఎన్నటికీ క్షమించరన్నారు. నాంపల్లి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాహుల్ చంద్రకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చిదంబరం వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ ప్రజలు నమ్మరని.. ఆరు గ్యారెంటీలు అని చెబుతున్న ఆ పార్టీ హామీలను కూడా ప్రజలు నమ్మే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి అన్నారు.




Tags:    

Similar News