వచ్చే ఎన్నికల్లో పార్టీని విలీనం చేస్తం: ప్రొఫెసర్ కోదండరాం

Update: 2023-06-04 09:59 GMT

రాష్ట్రానికి కేసీఆర్ పాలననుంచి విముక్తి కల్పించడానికి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో అయినా పనిచేసేందుకు తాము సిద్ధమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సూర్యపేట్ లో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఏ నిర్ణయం తీసుకోడానికికైనా సిద్ధంగా ఉన్నట్లు కోదండరాం తెలిపారు. అవసరమైతే పార్టీని విలీనం చేయడానికికైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. గత కొంత కాలంగా కోదండరాం టీజేఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ విలీనానికి కూడా సిద్ధమే అని కోదండరాం ప్రకటించడం రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Tags:    

Similar News