దోసెకు సాంబార్ ఇవ్వలేదని.. 11నెలల న్యాయ పోరాటం.. చివరికి

By :  Kiran
Update: 2023-07-14 03:43 GMT

దోసె ప్రియులెవరికైనా చట్నీతో పాటు.. సాంబార్ కావాల్సిందే. ఈ రెండిటి కాంబినేషన్ కు అల్లం చట్నీ తోడైతే ఆహా.. ఆ టేస్ట్ వేరంటూ లొట్టలేసుకుని తింటారు. దోసె ప్రియుడైన ఓ న్యాయవాది హోటల్ కు వెళ్లాడు. దోసెకు సాంబార్ ఇవ్వలేదని హెటల్ కు చుక్కలు చూపించాడు. కన్జ్యూమర్ కోర్టులో కేస్ వేసి.. హోటల్ తో ఫైన్ కట్టించాడు. ఈ ఘటన బీహార్ లో జరిగింది.

బీహార్ కు చెందిన మనీష్ పాఠక్ వృత్తిరిత్యా లాయర్. అతనికి బాగా ఆకలేసి రూ. 140 పెట్టి మసాలా దోసె ఆర్డర్ పెట్టాడు. పార్సిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తీరా చూస్తే పార్సిల్ లో సాంబార్ ప్యాకెట్ కనిపించలేదు. దాంతో కోపమొచ్చిన ఆయన.. కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా 11 నెలల న్యాయపోరాటం చేసి గెలిచాడు. హాటల్ నిర్వాహకులదే తప్పని తేల్చాడు. దాంతో నిర్వాహకులపై ఏకంగా రూ.3500 ఫైన్ విధించింది. 45 రోజుల్లోగా చెల్లించాలని కోర్ట్ తీర్పునిచ్చింది. అంతేకాకుండా ఫైన్ కట్టడంలో లేట్ చేస్తే.. 8శాతం వడ్డీ కట్టాల్సి వస్తుందని తెలిపింది.

Tags:    

Similar News