Parliamentary Elections : రాజకీయ కారణాల వల్లే పార్టీని వీడుతున్నా..బీజేపీ ఎంపీ

By :  Vinitha
Update: 2024-03-10 08:44 GMT


పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎంపీ బ్రిజేందర్ సింగ్ ప్రకటించారు. రాజకీయ కారణాల వల్లే బలవంతంగా తాను పార్టీని వీడాల్సి వస్తోందని ట్వీట్ చేశారు. హర్యానా హిసార్‌ పార్లమెంటరీ స్థానం నుంచి బ్రిజేందర్‌ సింగ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హర్యానా రాజకీయ దిగ్గజం, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ వారసుడే ఈ బ్రిజేందర్ సింగ్. అయితే ఆ పార్టీకి రాజీనామా చేసి వెంటనే కాంగ్రెస్ చేరారు.

దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో ఉన్న బీరేందర్ సింగ్..2014లో బీజేపీలోకి చేరారు. ఇక బ్రిజేందర్ 1998లో సివిల్స్‌ 9వ ర్యాంకర్‌. సొంత రాష్ట్రానికి ఐఏఎస్‌ అధికారిగా 21 ఏళ్లపాటు సేవలు అందించారు. అనంతరం జనరల్ ఎలక్షన్స్ టైంలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. హిసార్‌ ఎంపీగా.. పార్లమెంట్‌లో పలు కమిటీలకు సైతం బ్రిజేందర్‌ పని చేశారు.






Tags:    

Similar News