Odisha train accident: ఒడిశా రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు ఎలీస్ఐసీ సాయం

Update: 2023-06-04 12:20 GMT

ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంతో దేశం ఉలిక్కిపడింది. ఈ యాక్సిడెంట్ లో దాదాపు 278 మంది చనిపోయారు. 11వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ఈ ఘోర ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ఎల్ఐసీ అండగా నిలిచింది. బాధితులకు ఆర్థిక పరమైన రిలీఫ్ అందించేందుకు ఇన్సూరెన్స్ క్లయిమ్ కోసం డెత్ సర్టిఫికెట్ అవసరాన్ని మినహాయించి, క్లెయిమ్ సెటిల్ చేస్తామని ప్రకటించింది.

‘ఒడిశా మృతులు, బాధితులకు అండగా నిలిచేందుకు, ఆర్థికసాయం అందించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. డెత్ సర్టిఫికెట్ కు బదులుగా రైల్వే, పోలీసులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించిన మరణాల జాబితాను రుజువుగా అంగీకరిస్తా’మని ఎల్ఐసీ ఛైర్ పర్సన్ సిద్ధార్థ మోహంతి ప్రకటించారు. ఎల్ఐసీ పాలసీతో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన కింద ఉన్న పాలసీ సెటిల్మెంట్ ను కూడా సులభతరం చేస్తామన్నారు.

అంతేకాకుండా బ్రాంచ్ స్థాయిలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎల్ఐసీ పాలసీదారులకు ఏదైనా సందేహం ఉంటే.. ప్రత్యేక నంబర్ 02268276827 కాల్ చేసి సాల్వ్ చేసుకోవాలని తెలిపింది. 


Tags:    

Similar News