New Year Celecrations : నాన్వెజ్పైనే ఇంట్రెస్ట్.. ఒక్క రోజులోనే కేజీలు కేజీలు లాగించేశారు

Byline :  Bharath
Update: 2024-01-01 06:10 GMT

గతేడాదికి వీడ్కోలు పలుకుతూ.. నయా సాల్ కు వెల్ కం చెప్తూ సిటీ జనాలు బాగా ఎంజాయ్ చేశారు. నాన్ వెజ్ వంటలకే మొగ్గు చూపి.. చుక్కా ముక్కా తెగ లాగించేశారు. ఇయర్ ఎండింగ్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యం, నాన్ వెజ్ అమ్మకాలు భారీగా పెరిగాయి. లాంగ్ వీకెండ్, ఇయర్ ఎండ్ కలిసిరావడంతో.. అమ్మకాలు జోరందుకుని, సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఆదివారం సెలవు ఉన్నప్పటికీ మద్యం డిపోలను ఓపెన్‌‌లో పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు తరలించారు. దీంతో డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర మద్యం అమ్ముడుపోయింది. న్యూఇయర్ ఈవెంట్లు ముందే ఫిక్స్ కావడంతో క్లబ్బులు, పబ్బుల నిర్వాహకులు ముందే లిక్కర్ ను భారీగా డంప్ చేసుకున్నారు.

దీంతో పాటు డిసెంబర్ 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. రాత్రి ఒంటి గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రత్యేక పర్మిషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో మద్యంపై వచ్చే ఆదాయం మరింత పెరిగింది. మూడు రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేస్​లు, 6.31 లక్షల బీర్ కేస్​లు అమ్ముడయ్యాయి. ఇందులో ఒక్క 30వ తేదీనే రూ.313 కోట్ల లిక్కర్ అమ్ముడు పోవడం గమనార్హం.

ఈసారి చికెన్, మటన్ అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. డిసెంబర్ 31 ఆదివారం కావడంతో.. నాన్ వెజ్ షాపుల వద్ద ఎక్కడ చూసినా భారీగా జనాలు క్యూకట్టారు. ఉదయం 7 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. దీంతో గ్రేటర్ లో అమ్మకాలు రికార్డ్ బ్రేక్ చేశాయి. నిన్న ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయింది. ఈ లెక్కన కిలో చికెన్ రూ.230 కాగా.. 4.5 లక్షల కిలోలకు రూ.10.35 కోట్ల బిజినెస్ జరిగిందని పౌల్ట్రీరంగ నిపుణులు తెలిపారు. మటన్ కూడా దాదాపు 25 నుంచి 30 వేల క్వింటాళ్లు అమ్ముడు పోయింది. ప్రస్తుతం మటన్ ధర రిటైల్ మార్కెట్ లో కిలో రూ.800 నుంచి రూ.900 వరకు పలుకుతున్నా ఎవరూ వెనకాడలేదు. చేప విక్రయాలు కూడా భారీగానే జరిగాయి. రామ్​నగర్​, జియాగూడ, సికింద్రాబాద్​ మోండా మార్కెట్​లో 2 వేల క్వింటాళ్లు అమ్ముడు పోయింది.




Tags:    

Similar News