wines bandh: సెప్టెంబర్ 6 నుంచి.. ఐదు రోజుల పాటు వైన్స్ బంద్
మందు లేనిదే రోజు గడవని మందు బాబులు దేశంలో చాలామందే ఉన్నారు. ఇక మద్యం దుకాణాలు మూతపడుతున్నాయంటే.. ముందు రోజే బాటిళ్లు స్టాక్ తెచ్చుకుని పెట్టుకుంటారు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఐదు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. అయితే తెలంగాణలో అనుకుని ఫీల్ అయ్యేరు. ఢిల్లీ డ్రింకర్స్ కు షాక్ ఇస్తూ ఆప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 6 నుంచి 10 తేదీ వరకు వైన్ షాపులు బంద్ ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 6, 7 తేదీల్లో శ్రీ కృష్ణ జన్మాష్ణమి వేడుకలు జరుగనున్నాయి. అంతేకాకుండా 9,10 తేదీల్లో రాజధానిలో జీ20 సమ్మిట్ మీటింగ్స్ ఉన్నాయి. ఈ సమావేశానికి అన్ని దేశాల అధికారులు వస్తున్న కారణంగా.. 8, 9, 10 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీకి సెలవులు ప్రకటించాయి. ఈ కారణంగా వరుసగా ఐదు రోజులు ఢిల్లీలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. వరుస సెలవులు ఉండటంతో ఇప్పటి నుంచే మందు బాబులు దుకాణాల ముందు క్యూ కట్టారు. దీంతో మద్యం అమ్మకాలు గరిష్ఠానికి చేరాయి.