వెనక్కి తగ్గని విపక్షాలు.. ఉభయ సభలు మధ్యాహ్నానికి వాయిదా

Update: 2023-07-26 08:03 GMT

లోక్‌స‌భ, రాజ్య‌స‌భ‌ల్లోనూ ఇవాళ కూడా మ‌ణిపూర్ అంశంపై రచ్చ కొన‌సాగింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించాలంటూ ప్రతిపక్షసభ్యులు నిరసన కొనసాగించారు. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యులంతా ప్రధాని సభకు రావాల్సిందేనని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సభను మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత సభ తిరిగి స‌మావేశమైనా పరిస్థితిలో మార్పురాలేదు. స్పీకర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు అనుమ‌తించిన అనంతరం ఎంపీల ఆందోళన కొనసాగింది. సభ్యులు నినాదాలతో హోరెత్తించడంతోస్పీకర్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అటు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నినాదాలు చేస్తూ సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ సభను తొలుత మధ్యాహ్నం 12 గంటలకు ఆ తర్వాత మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేశారు.



 


Tags:    

Similar News