లోక్సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ కన్నా ఒక రోజు ముందే స్పీకర్ సభను వాయిదా వేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభంకాగా.. డిసెంబర్ 22 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే గురువారమే సభను నిరవధికంగా వాయిదావేశారు. గురువారం సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, సీఈసీ, ఈసీ నియామకాల బిల్లులను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
శీతాకాల సమావేశాల చివరి రోజున సైతం లోక్ సభలో సస్పెన్షన్ల పర్వం కొనసాగింది. గురువారం మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు దీపక్ బైజ్, డీకే సురేశ్, నకుల్ నాథ్ అనుచితంగా ప్రవర్తించారంటూ స్పీకర్ ఓం బిర్లా వేటు వేశారు. వీరితో కలుపుకుని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకూ లోక్‌సభ నుంచి సస్పెండైన ఎంపీల సంఖ్య 100కి చేరింది.
పార్లమెంటులో భద్రతా వైఫల్యం, ఎంపీల సస్పెన్షన్పై ఈ రోజు కూడా రచ్చ కొనసాగింది. ఉదయం లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే.. పెద్ద సంఖ్యలో విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ముగ్గురు ఎంపీలు నిరసన తెలిపారు. క్వశ్చన్ అవర్ లో సభలో ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
#WATCH | Lok Sabha adjourned sine die. pic.twitter.com/cYMql3DMEw
— ANI (@ANI) December 21, 2023