IMD: ఈ నెల 14న బంగాళాఖాతంలో అల్పపీడనం

Byline :  Bharath
Update: 2023-11-12 05:46 GMT

ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ నెల 14వ తేదీనే అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తర్వాత అది పశ్చిమ- వాయువ్య దిశగా కదుతుందని ప్రకటించింది. అనంతరం దక్షిణ బంగాళాఖాతంలో నవంబర్ 16 నాటికి వాయుగుండంగా బలపడుతుందని చెప్పుకొచ్చారు. దీని ప్రభావం వల్ల సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అల్పపీడనం తొలుత నవంబర్ 15న ఏర్పడవచ్చని అంచనా వేయగా.. ఒకరోజు ముందుగానే ఏర్పడుతుందని ఐఎండీ పేర్కొంది. కాగా ఈ నెల 13 నుంచి కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్‌ ప్రాంతాల్లో, 15, 16 తేదీల్లో పశ్చిమ మధ్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో గరిష్ఠంగా గంటకు 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.


 


Tags:    

Similar News