Viral News : నోట్లు మార్చుకోవడానికి దెయ్యం దగ్గరికి వెళ్తూ అరెస్ట్..

Update: 2023-10-24 10:05 GMT

రద్దయిన 1000, 500 నోట్లను మార్చుకోవడానికి జనం ఎన్ని తిప్పలు పడ్డారో మనకు అనుభవపూర్వకంగా తెలుసు. 2 వేల నోట్లను కూడా రద్దు చేసినా అవి సామాన్యుల దగ్గర లేకపోవడంతో సమస్యలు తలెత్త లేదు. రద్దయిన ఏ నోట్లనైనా బ్యాంకులు మాత్రమే మార్పిడి చేస్తాయి. అయితే ఓ దెయ్యం వాటిని మారుస్తుందని వెర్రిపప్పలా నమ్మిన ఓ వ్యక్తి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దసరా పండగ రోజున ఈ సంఘటన చోటుచేసుకుంది. మోరెనా జిల్లాలోని బరోఖర్‌కు చెందిన సుల్తాన్ కరోసియా అనే ప్రబుద్ధుడు రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లను భారీగా కూడబెట్టుకున్నాడు. అప్పట్లో మార్చుకునే అవకాశం దొరక్కనో, లేకపోతే భయపడో మొత్తానికి అలాగే దాచుకున్నాడు. వాటి విలువ రూ. 47 లక్షలు. సుల్తాన్‌కు ఇటీవల ఓ మంత్రగాడు పరిచయమయ్యాడు. ఆ నోట్లను తన దగ్గరికి తెస్తే ఓ మంచి దెయ్యం సాయంతో కొత్త నోట్లుగా మారుస్తానని చెప్పాడు. బుర్రలేని సుల్తాన్ అమాయకంగా ఊకొట్టాడు. దసరా రోజున నోట్లను మూటగట్టుకుని బైక్‌పై మంత్రగాడి దగ్గరికి వెళ్తుండా పోలీసులు అరెస్ట్ చేశారు. సుల్తాన్ దెయ్యం కథ చెప్పాడు. పోలీసులు నవ్వుకుంటూ స్టేషన్‌కు పట్టుకెళ్లారు. 2016లో పెద్ద నోట్లు రద్దు కావడానికి ఆరేడు నెలల ముందు ఓ చెత్త కుప్పలో తనకు ఆ నోట్లు కనిపించాయని విచారణ చెప్పారు.vIRA

Tags:    

Similar News