అమానుషం..మెడకు బెల్ట్ కట్టి కుక్కలా అరిపించారు

Update: 2023-06-19 12:47 GMT

సమాజంలో కొందరి ప్రవర్తన అవమానకరంగా ఉంటుంది. వారి ఆనందం కోసం తోటి మనుషులనే వేధిస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కొందరు ఆకతాయిలు కర్కషంగా ప్రవర్తించారు. ఓ యువకుడిని వేధింపులకు గురిచేస్తూ ఆనందం వ్యక్తం చేసారు. కుక్కలా మెరగమని, నడవమని బెదిరింపులకు దిగింది. ఈ వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించింది.

ఇటీవల మధ్యప్రదేశ్‌లో ఓ వీడియో వైరల్ అయ్యింది. దాంట్లో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు వేధిస్తున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఆ యువకుడి మెడ చుట్టూ బెల్టు కట్టి వేధింపులకు పాల్పడ్డారు. కుక్కలా మొరగమంటూ బెదిరించారు. అంతేకాకుండా బాధితుడి తల్లి, చెల్లిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారు. అయితే ఆ యువకుడు మాత్రం తాను ఏ తప్పు చేయలేదని..తనని వదివేయాలని ప్రాధేయపడడం ఆ వీడియోలో కనిపించింది. ఇది కాస్త హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెళ్లడంతో ఆయన ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే దర్యాప్తు జరపాలని, 24 గంటల్లో నిందితులపై చర్యలు తీసుకోవాలని భోపాల్ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ముగ్గురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 


Tags:    

Similar News