ఈ ఎమ్మెల్యేకు కారు కాదు.. కనీసం సొంత బైక్ కూడా లేదు

Byline :  Bharath
Update: 2023-12-08 09:55 GMT

ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచాక వాళ్ల క్రేజ్ ఎలా ఉంటుందో తెలిసిందే. చుట్టూ సెక్యూరిటీ, కొత్త కాన్వాయ్.. సామాన్యులు అనుమతి లేకుండా దగ్గరికి వెళ్లడం ఎవరితరం కాదు. అయితే తాజాగా ఎన్నికల్లో గెలిచిన ఈ కొత్త ఎమ్మెల్యే మాత్రం అవేవీ లేకుండా అసెంబ్లీకి వచ్చాడు. కాన్వాయ్ కాదు కదా.. ఆయనకు కనీసం సొంత కారు కూడా లేదు. అందుకని మొదటి సమావేశానికి ఏకంగా బైక్ 333 కిలోమీటర్లు ప్రయాణించి అసెంబ్లీ చేరుకున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కమలేశ్వర్‌ డొడియార్‌ అనే ఎమ్మెల్యే బైక్‌పై అసెంబ్లీకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. బైక్ ముందు భాగంలో ఎమ్మెల్యే అని స్టిక్కర్‌ అతికించుకొని 330 కి.మీ. ప్రయాణించి అసెంబ్లీ అధికారులకు తన విజయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించారు. ఆయన స్వస్థలం రత్లాం జిల్లా సైలానా నుంచి భోపాల్ కు బైక్ సై జర్నీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తనకు కారు కొనే స్తోమత లేదని, సొంత బైక్ కూడా లేదని, తన బంధువు బైక్ తీసుకుని వచ్చినట్లు తెలపారు. లా చదివిన కమలేశ్వర్.. భారతీయ ఆదివాసీ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాగా ఆ పార్టీ తరుపున గెలిచిన ఏకైక అభ్యర్థి కమలేశ్వర్ కావడం విశేషం.

Tags:    

Similar News