మూత్ర విసర్జన బాధితుణ్ని నేను కాదు.. సీఎంతో కాళ్లు కడిగించుకున్న వ్యక్తి
మధ్యప్రదేశ్ కు చెందిన ఓ ఆదివాసి పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేయగా.. అందుకు సంబంధించిన వీడియో 10 రోజుల క్రితం విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు పార్టీలు, దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. నిందితుడిని అరెస్ట్ చేయించి బాధితుడైన దశ్మత్ రావత్ ను సీఎం కార్యాలయానికి పిలిపించుకున్నాడు. అనంతరం అతడి కాళ్లను నీళ్లతో కడిగిన సీఎం క్షమాపణ కోరాడు. ఇంతటితో ఈ విషయం ముగిసిందనుకుంటే తాజాగా మరో కాంట్రవర్సీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది
సీఎం కాళ్లు కడిగిన వ్యక్తి... మూత్ర విసర్జన ఘటన బాధితుడు ఒకటి కాదని.. వారిద్దరూ వేరంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. వీడియోలో కనిపించిన వ్యక్తి 16 నుంచి 19 ఏళ్లకు మించి ఉండరని కానీ.. సీఎం కాళ్లు కడిగిన వ్యక్తి మాత్రం 35 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉంటారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఇదే ఆరోపణ చేసింది. "శివరాజ్ వేరొకరి కాళ్లు కడిగి డ్రామా చేశారు. అసలు బాధితుడు కనిపించకుండా పోయాడా? శివరాజ్ జీ.. మరీ ఇంత పెద్ద కుట్రనా? మధ్యప్రదేశ్ మిమ్మల్ని క్షమించదు" అంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్ లో విమర్ళు గుప్పించింది.
सीधी पेशाब कांड में बड़ा खुलासा,
— MP Congress (@INCMP) July 9, 2023
— शिवराज ने किसी और के पांव धोने की नौटंकी की, असली पीड़ित लापता हैं क्या ?
शिवराज जी,
इतना बड़ा षड्यन्त्र ❓
मध्यप्रदेश आपको माफ नहीं करेगा। pic.twitter.com/JCvXlUJr7w
మరోవైపు సీఎం చేత కాళ్లు కడిగించుకున్న వ్యక్తి.. ఆ ట్విట్టర్ పోస్ట్ లో మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, ఈ విషయం వారికి ముందే చెప్పానని అంటున్నాడు. అయితే ప్రవేశ్ శుక్లా ను మాత్రం క్షమించి వదిలేయాలని చెబుతున్నాడు.