అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

Update: 2023-07-29 03:06 GMT

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి భూమి కంపించింది. అర్థరాత్రి 12.57 గంటల సమయంలో పోర్టు బ్లెయిర్‌ సమీపంలో భూప్రకపంనలు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ ప్రకటించింది. భూ అంతర్భాగంలో 69 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెప్పారు.

పోర్ట్ బ్లెయిర్ కు 126 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అర్థరాత్రి సమయం కావడంతో జనానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశాయి. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. ఇప్పటి వరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు చెప్పారు.

Tags:    

Similar News