5 కోట్లు గెల్చుకుని 58 కోట్లు పోగొట్టుకున్న మనోడు..

Update: 2023-07-23 05:19 GMT

ఆన్‌లైన్ జూదానికి బాసనైన ఓ వ్యాపారి ఇల్లు ఒళ్లు మొత్తం గుల్ల చేసుకున్నాడు. మోసగాళ్లు మొదట లక్షలు, తర్వాత కోట్లు తగిలేలా చేసి తర్వాత భారీ స్థాయిలో గురించి కొంప ముంచారు. మహారాష్ట్రలోని గోండియాలో ఈ మోసం జరిగింది. గోండియాకు చెందిన ఓ వ్యాపారికి ఇటీవల అనంత్ అలియాస్ నవరతన్ జైన్ అనే అన్ లైన్ బుకీతో పరిచయమైంది. వాట్సాప్ లింకుల ద్వారా జైన్ గ్యాబ్లింగ్ నడిపించాడు. వ్యాపారి మొదట రూ. 8 లక్షలు డిపాజిట్ చేసి చిన్నచిన్న మొత్తాల్లో పందెం కాశాడు. వేలు పెడితే లక్షలు తగిలాయి. లక్ష పెడిడితే పది లక్షలు వచ్చాయి. తర్వాత కోటి కూడా తగిలింది. జూదంలో మొత్తం రూ. 5 కోట్లు సంపాదించాడు. దురాశతో జోరుగా సాగించాడు. పందెం కాసేకొద్దీ పోవడమే తప్ప వచ్చింది లేదు. మొత్తం రూ. 58 కోట్లు పోయాయి. తనను మోసం చేశారని ఆలస్యంగా అర్థమై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు జైన్ వివరాలు ఆరా తీసి అతని ఇంటిపై ఆకస్మిక దాడి చేశారు. నిందితుడు అప్పటికే పారిపోయాడు. జైన్ ఇంట్లో రూ. 14 కోట్ల నగదుతోపాటు నాలుగు కేజీల బంగారం దొరికింది. జైన్ ముంబై నుంచి దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆన్ లైన్ మోసగాళ్లు మొదట డబ్బును ఎరవేసి ఉచ్చులోకి లాగుతారని, అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని జూదర్లను హెచ్చరించారు.

Tags:    

Similar News