న్యూ ఇయర్ అంటేనే మస్త్ కిక్ ఉంటుంది. ప్రజలకు మందు.. ప్రభుత్వానికి వాటి పైసల్ మస్త్ కిక్ ఇస్తాయి. ప్రజల డిమాండ్తో పాటు న్యూఇయర్ను క్యాష్ చేసుకునేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. ఈ క్రమంలో మందు బాబులకు మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. డిసెంబర్ 24, 25, 31 తేదీల్లో అర్ధరాత్రి 1గంట వరకు వైన్ షాపులు, ఉదయం 5గంటల వరకు బార్‌లు తెరిచి ఉంచేందుకు పర్మిషన్ ఇచ్చింది.
పండుగలు వచ్చాయంటే లిక్కర్కు గిరాకీ పెరుగుతుంది. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతుంది. ఈ నెల 25న క్రిస్మస్ ఉండగా.. 31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ సేల్స్ భారీ జరుగుతాయి. దీనిని క్యాష్ చేసుకునేందుకు ఏక్ నాథ్ షిండే సర్కార్ వైన్స్ టైమింగ్స్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.