Dream11 One Crore Winner : ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్​.. ఎస్​ఐ​కు రూ. కోట్ల జాక్​పాట్​.!!

Byline :  Veerendra Prasad
Update: 2023-10-12 01:36 GMT

ఆన్‌లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్‌ 11’ ఓ ఎస్సైని రాత్రికి రాత్రే కోటీశ్వరుడ్ని చేసింది. దీంతో ఆ పోలీస్ అధికారి కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. దసరాకు ముందే తమ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొందని సంతోషం వ్యక్తం చేస్తున్నది. మహారాష్ట్రలోని పింప్రి చించ్​వాడ్​ పోలీస్​ కమిషనరేట్​కు చెందిన( Somnath Zende) సోమ్​నాథ్​ జెండే...  (Dream11 One Crore Winner) డ్రీమ్ ​11లో రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు.




 


మూడు నెలలుగా సోమ్​నాథ్​ డ్రీమ్​ 11లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత్​ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్​లో భాగంగా మంగళవారం జరిగిన ఇంగ్లాండ్​- బంగ్లాదేశ్ మ్యాచ్​లో సోమ్​నాథ్​ బెట్టింగ్​ వేశారు. మ్యాచ్​లో ది బెస్ట్ గా ఆడిన ప్లేయర్లతోనే టీమ్​ను ఎంపిక చేసుకున్న ఆయన.. ఫాంటసీ గేమ్​లో అగ్రస్థానంలో నిలిచి రూ.1.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ విషయం తెలిసి కుటుంబంలో ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. తాను కొన్ని నెలలుగా డ్రీమ్​ 11లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నానని.. అయితే ఇంతవరకు సక్సెస్​ కాలేకపోయానని చెప్పుకొచ్చారు సోమనాథ్. మంగళవారం కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డ్రీమ్ ​11 టీమ్​ను ఎంచుకున్నానని, ఆ తర్వాత తన టీమ్​ టాప్​లోకి వచ్చిందన్నారు. టాప్ లోకి రాగానే వెంటనే రూ.1.5 కోట్ల గెలుచుకున్నట్లు మెసేజ్​ వచ్చిందని.. మొత్తానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు.     




 





Tags:    

Similar News