మహీంద్రా గ్రూప్ CEO మరియు MD అనీష్ షా.. తన నెలవారీ జీతంలో భారీ పెంపును పొందనున్నారు. ప్రస్తుతం రూ.18 లక్షలుగా ఉన్న బేసిక్ శాలరీని.. 83 శాతానికి పెంచింది కంపెనీ యాజమన్యం. దీంతో వచ్చే నెల ఆగష్టు 1 నుంచి ఆయన నెల జీతం రూ.55లక్షలుగా ఉండనుంది. ఈ పెంపు మార్చి 31, 2025 వరకు అమలులో ఉంటుంది.
2019లో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ CFOగా నియమితుడయ్యారు అనీష్ షా. 2021లో డాక్టర్ పవన్ గోయెంకా పదవీ విరమణ చేసిన తర్వాత అతను మహీంద్రా గ్రూప్ యొక్క MD మరియు CEO బాధ్యతలను స్వీకరించారు. దీంతో ఆయనే మహీంద్రా గ్రూప్ వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు.
అనీష్ షాతో పాటు, ఏప్రిల్ 2020 నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆటోమోటివ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న రాజేష్ జెజురికర్ భారీ హైక్ ను పొందారు. 84 శాతం పెంపుతో నెలకు ₹ 26 లక్షల నుండి ₹ 48 లక్షలను అందుకోనున్నారు. అతని పనితీరు ఆధారంగా ఈ భారీ పెంపును ప్రకటించడం జరిగిందని కంపెనీ ఓ నివేదికలో వెల్లడించింది.