గవర్నర్ పద్దతి అసలేం బాగోలేదు: సీఎం

Byline :  Bharath
Update: 2023-08-28 10:28 GMT

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సార్వత్రిక ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి లోక్ సభ ఎన్నికలు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదని అన్నారు. ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను బీజేపీ పార్టీ బుక్ చేసుకుందన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సంద్భంగా మాట్లాడిన మమత.. మరోసారి బీజేపీ అధికారంలోని వస్తే నిరంకుశ పాలనే ఉంటుందని ఆరోపించారు.




 


వెస్ట్ బెంగాల్ లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. అదే ఊపులో ఇప్పుడు బీజేపీని తప్పకుండా ఓడిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల్లో చీలిక తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, మరోసారి ఆ పార్టీకి అధికారం కట్టబెడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు. బెంగాల్ గవర్నర్ తీరుపై మండిపడ్డ మమత.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగొద్దని సూచించారు. గవర్నర్ తీరు బాగొలేదని మమత మండిపడ్డారు.




Tags:    

Similar News