పెళ్లి క్యాన్సిల్ అన్నందుకు యువతిపై కత్తితో దాడి

Byline :  Veerendra Prasad
Update: 2023-09-29 07:36 GMT

ప్రేమించుకొని, పెద్దలను ఒప్పించి పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాక.. ఆ యువతి.. నీతో పెళ్లి ఇష్టం లేదన్నందుకు సదరు ప్రేమికుడు రెచ్చిపోయాడు. ఉన్మాదిలా మారి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.




 


కోజికోడ్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల యువకుడు అర్షద్, 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ యువతి అతనితో పెళ్లి రద్దు చేసుకుంది. దీంతో అర్షద్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం నాదపురంలోని ఓల్డ్ మార్కెట్ కు వచ్చిన యువతిని చూసి కత్తి తీసుకొని వెంబడించాడు. ఆ బాలిక తప్పించుకునేందుకు రోడ్ పక్కనే ఉన్న షాప్ లోకి పరుగెత్తింది. కానీ ఆమెను వెంబడించి.. పట్టుకొని కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న ఓ షాప్ యజమాని అర్షద్ ను అడ్డుకోబోయాడు. ఈ ప్రయత్నంలో అతని చేతికి కూడా గాయాలు అయ్యాయి. అదే సమయంలో స్థానికులంతా చేరుకొని ఆ యువకుడిని నిలువరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.




 


కాగా.. ఈ ఘటనలో బాలిక చేతికి గాయాలు కావడంతో ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దారుణానికి తెగబడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ బాలిక పెళ్లి రద్దు చేసిన నాటి నుంచి నిందితుడు ఆమె కుటుంబాన్ని బెదిరించేవాడని, దీంతో ఆ బాలిక కుటుంబం మొత్తం వేరే ఇంటికి వెళ్లిపోయిందని స్థానికులు చెప్పుకుంటున్నారు.




 




Tags:    

Similar News