స్వాతంత్య్ర సమరయోధుడి భార్యను తగలబెట్టిన ‘మణిపూర్’ మూక

Update: 2023-07-23 05:59 GMT

తెగల యుద్ధంతో రావణ కాష్టంలా రగులుతున్న మణిపూర్‌లో గత రెండు నెలలుగా జరిగుతున్న హింసలో ఘోరాతి ఘోరాలు ఒకటొకటే వెలుగు చూస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారాల తర్వాత చంపేపి, తల తీసిన ఉదంతాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తంగా, మరింత దారుణ సంఘటన బయటికొచ్చింది. ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను అల్లరిమూకలు సజీవ దహనం చేశాయి. మే 28న జరిగిన ఈ దారుణ ఆలస్యంగా వెలుగుచూసింది. కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామానికి స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబీని ఆందోళనకారులు ఇంట్లో బంధించి నిప్పుపెట్టారు. ఆమె వయసు 80 ఏళ్లపైనే. ఇప్పటికీ ఆమె అస్థికలు ఇంట్లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చురాచాంద్‌ సింగ్‌ దేశానికి అందించిన సేవలకు గాను మాజీ అప్పట్లో ఏపీజే అబ్దుల్‌కలామ్‌ ఆయనను సన్మానించారు.

మే 28న సెరో గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాల్పులు కూడా జరిగాయి. సైరోకైబామ్ ఆ సమయంలో ఇంట్ల ఉండగా బయటి నుంచి గడియ వేసి తగలబెట్టారు. కుటుంబ సభ్యులు కాపాడడానికి ప్రయత్నించగా ఆమె అప్పటికే కాలిపోయింది. సైరోకైబాబ్ మనవడు ప్రేమకాంత మీడియాకు ఈ విషయం చెప్పాడు. అల్లరి మూకలు తనపై కాల్పులు జరపగా తప్పించుకున్నానని వివరించాడు. ‘‘కాల్పులు జరుగుతున్నప్పుడు ఆమె మమ్మల్ని వెళ్లిపోమని చెప్పింది. తను మాత్రం చనిపోయింది. దురాగతానికి పాల్పడిన బాధ్యులను కఠినంగా శిక్షించాలి’’ అని కోరాడు.

Tags:    

Similar News