MANIPUR BJP OFFICE : గుంపులుగా వచ్చి.. బీజేపీ ఆఫీస్కు నిప్పు

Byline :  Bharath
Update: 2023-09-28 03:33 GMT

మణిపూర్లో హింసకాండ మళ్లీ మొదలయింది. రాష్ట్రమంతా అల్లకల్లోలంగా మారింది. ఇద్దరు విద్యార్థుల హత్యతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి (MANIPUR BJP OFFIC) ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జనాల్లో ఆవేశం పెల్లుబుకి బీజేపీ ఆఫీసును తగలబెట్టారు. బుధవారం దౌబల్ జిల్లాలోని బీజేపీ మండల కార్యాలయంపై నిరసనకారులు పెద్ద ఎత్తున దాడి చేశారు. ఆ గుంపు కార్యాలయ మెయిన్ గేట్ ను ధ్వంసం చేసి, అద్దాలు పగలగొట్టారు. కార్యాలయం చుట్టూ ఉన్న వాహనాలను ధ్వసం చేశారు. టైర్లు, వాహనాలను సైతం తగలబెట్టి ఇండో- మయన్మార్ రోడ్డుపై నిరసన తెలిపారు.

దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో భద్రత సిబ్బంది, నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో నిరసన కారులు భద్రతా సిబ్బందిపై రాళ్లు విసరగా.. తప్పని సరి పరిస్థితిలో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, మాక్ బాంబులు, లైవ్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ ఆందోళనల మధ్య ఇండో- మయన్మార్ రహదారిని మూసివేశారు. బీజేపీ ఆఫీస్ పై దాడులు జరగడం ఇదేం కొత్త కాదు. ఇదివరకు జూన్ నెలలో.. మణిపూర్ లో పెరుగుతున్న జాతి ఉద్రిక్తతల మధ్య దుండగులు మూడు బీజేపీ ఆఫీస్ లను ధ్వంసం చేశారు. 




Tags:    

Similar News