కుప్పం సరిహద్దులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు మృతి
Byline : Krishna
Update: 2023-09-11 05:53 GMT
కుప్పం సరిహద్దు బెంగళూరు - చెన్నై హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టెంపోను డీసీఎం ఢీకొట్టింది. దీంతో టెంపో డివైడర్ వద్ద నిల్చున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు మృతిచెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలో తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని చండీయార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఒనన్గుట్టై వాసులుగా గుర్తించారు.
టెంపో టైర్ పంక్చర్ అవ్వగా.. డ్రైవర్ టైర్ మారుస్తున్నాడు. దీంతో మహిళలంతా డివైడర్ వద్ద నిల్చోగా డీసీఎం వెనుక వచ్చి ఢీకొట్టింది. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.