మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 25మంది సజీవదహనం

Update: 2023-07-01 02:21 GMT

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనమయ్యారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. అర్ధరాత్రి కావడం.. ప్రయాణీకులు గాఢ నిద్రలో ఉండడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

32మందితో బస్సు నాగపూర్ నుంచి పూణే వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సు టైర్ పేలి బోల్తాపడింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగ్గా.. మంటలు ధాటికి బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News