BREAKING NEWS: భారీ భూకంపం, 69 మంది మృతి

Byline :  Bharath
Update: 2023-11-04 02:30 GMT

హిమాలయ దేశం నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి 11:32 గంటలకు నేపాల్ లోని జాజర్కోట్ జిల్లాలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.4గా నమోదయింది. అంతర్భూభాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు రావడంతో భూమి కంపించిందని నేషనల్‌ ఎర్త్‌క్వేక్‌ మెజర్‌మెంట్‌ సెంటర్‌ తెలిపింది.జాజర్కోట్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న రుకుం పశ్చిమ జిల్లాలోనూ భాకంపం వచ్చింది. భూకంపం దాటికి దాదాపు 69మంది మృతిచెందారు. వందల మంది ప్రజలు క్షతగాత్రులయ్యారు. మ‌ృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్ లో నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో భూకంపం రావడం ఇది మూడోసారి. ఇళ్లు, కట్టడాలన్నీ నేలమట్టం అయ్యాయి.

ఢిల్లీలోనూ కంపించింది:

నేపాల్ భూకంపం తీవ్రత ఢిల్లీలోనూ కనిపించింది. ఢిల్లీలోనూ భారీ భూకంపం సంభవించింది. సుమారు 20 సెకన్లపాటు భూమి కంపించడంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దీని తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 6.4గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కాగా ఎటువంటి ప్రాణ హాని జరగలేదని అధికారులు చెప్పుకొచ్చారు. అటు యూపీ, బిహార్లలోనూ ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తుంది. 

Tags:    

Similar News