షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం.. భయంతో మూడో అంతస్తు నుంచి..

Update: 2023-07-13 10:47 GMT

ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గౌర్‌ సిటీ 1 ప్రాంతంలో ఉన్న గెలాక్సీ ప్లాజాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు ప్రజలు.. తప్పించుకునేందుుక మూడో ఫ్లోర్ నుంచి దూకారు. మూడో ఫ్లోర్లోని కిటికీల నుంచి దూడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో ఓ వ్యక్తికి తల, వెన్నెముకకు తీవ్ర దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. ప్రజలు భవనంపై నుంచి కిందకు దూకుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Tags:    

Similar News