తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విరుద్ నగర్ జిల్లాలోని ఓ పటాకుల కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంపై సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.3లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష పరిహారం ప్రకటించారు. విన్నర్ కంపెనీకి చెందిన బాణాసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గత అక్టోబర్ లోనూ ఇటువంటి ప్రమాదమే జరిగింది. అప్పుడు 10మందికి పైగా మరణించారు.