షాకింగ్.. కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన భవనాలు.. (వీడియో)

Update: 2023-08-24 06:11 GMT

హిమాచల్ ప్రదేశ్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడటంతో అందరూ చూస్తుండగానే పలు బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎత్తైన భవనాలన్నీ ఒకేసారి కుప్పకూలడంతో ఆ ప్రాంతమంతా దుమ్ము ధూళితో నిండిపోయింది. ప్రమాదం పొంచి ఉండటంతో ఆ బిల్డింగుల్లో ఉన్న వారిని గతంలోనే ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. కళ్ల ముందే బిల్డింగ్ కూలిపోతుండటం చూసి స్థానికులు భయాందోళలకు గురయ్యారు. అనీ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారియి.

ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు బిల్డింగ్ లు కుప్పకూలిన ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. రానున్న రెండు రోజుల్లోనూ రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వర్షాల కారణంగా కులు,మండీ మధ్య రోడ్డు మార్గం తెగిపోయింది. ప్రత్యామ్నాయ మార్గం సైతం మూసుకుపోవడంతో రవాణా పూర్తిగా స్తంభించింది. రుతుపవనాల కారణంగా ఈ సీజన్ లో ఇప్పటి వరకు హిమాచల్ ప్రదేశ్లో మూడుసార్లు అతి భారీ వర్షాలు పడ్డాయి. జూన్ 24 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ. 8వేల కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రకటించారు.




Tags:    

Similar News