తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ కీలక ప్రకటన

Byline :  Krishna
Update: 2023-11-13 16:49 GMT

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే రెండు రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీన్ని ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్‌ ఉందని చెప్పింది.

ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నవంబర్‌ 15వ తేదీ నాటికి అల్పపీడనంగా మారనుందని.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం ఆగ్నేయం, నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది తెలిపింది. ఇది అల్పపీడనంగా మారేందుకు అనుకూలమైన వాతావరణం నెలకొందని వివరించింది.


Tags:    

Similar News